At the End of Time - Telugu
At the End of Time - Telugu
ఈనాడు చాలామంది క్రైస్తవులు దేవుడు ఈ జీవితములో ఏమి చేయును అని చూస్తుంటారు. ఏమైనను, దేవుడు మనకు చేయవలెనని కోరుకొనువాటియందు ఈ జీవితము ఒక అతి చిన్న భాగము మాత్రమే. డెరిక్ ప్రిన్స్ హెబ్రీయులకు 6:1-2లో చూపబడిన చివరి రెండు పునాది సిద్ధాంతములు శరీరము యొక్క పునరుత్థానము మరియు నత్యమైన నిత్యత్వము. నిత్యత్వముపై ఈ కేంద్రీకరణ యొక్క ఉద్దేశ్యము మనము ఈ జీవితము మీదనే దృష్టిపెట్టకూడదని బోధించుట కొరకై ఉన్నది. ఈ చిన్న పుస్తకములో డెరిక్ ప్రిన్స్ నిత్యత్వము యొక్క స్వభావమును వెల్లడిచేసి, అంత్యకాలమందలి సంభవముల క్షేత్రములో మన ముందు ఉండబోవువాటిని క్లుప్తముగా చెప్పుచున్నారు. ఆయన ఈ క్రింది ప్రార్థనతో ముగించుచున్నారు. తండ్రీ, నేను నా జీవితములోని అశాశ్వతమైన, దృశ్యమైన అంశములను చూడకుండా, నిత్యమైన అదృశ్యరాజ్యమును చూచునట్లు నా కళ్లకు శిక్షణనిచ్చుటకు సహాయము చేయుము ఈ భూమి నా నిత్యనివాసము కాదని నేను జ్ఞాపకముంచుకొనునట్లు నాకు సహాయము చేయుము. ప్రభువైన యేసు వచ్చునప్పుడు ఆయననను కలుసుకొనుటకు సిద్ధముగా నుండుటకు, బైబిల్ ప్రవచనము యొక్క వెలుగులో అంత్యకాల సంభవములను నేను వివేచించగలుగునట్లు నాకు సహాయము చేయుము, ఆమేన్.