Final Judgement - Telugu
Final Judgement - Telugu
కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు, దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణుల మగుటకు సాగిపోదము. హెబ్రీయులకు 6:1-2 పునాది సిద్ధాంతాలలో నిత్యమైన తీర్పు అనేది ఆఖరిది .ఇందులో చరిత్రలో దేవుని తీర్పు ఉంటాది, అలాగే మనము కాల పరిధిని (క్రమను దాటి నిత్యత్వం లోనికి అడుగు పెట్టినప్పుడు, దేవుని ఎదుట ఎదుర్కోబోయే తీర్పులు కూడా ఉంటాది. దేవుని తీర్పు లో ఐదు సూత్రాలు ఉన్నాయి.ఇవన్నీ రోమీయులకు వ్రాసిన పత్రిక లో ఉన్నాయి. ఈ యొక్క చిన్న పుస్తకంలో నిత్యత్వం లోనికి అడుగు పెట్టిన తర్వాత తీర్పులో సంభవించే నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నవి: యేసుక్రీస్తు యొక్క న్యాయ పీఠం ఇశ్రాయేలు పైన దేవుని తీర్పు అన్య జనాంగములు పైన దేవుని తీర్పు ధవళ సింహాసనం తీర్పు ఈ నాలుగు తీర్పులో యొక్క ప్రాముఖ్యమైన విషయాలను అధ్యయనం చేస్తూ ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకని మరియూ ఎలా జరుగుతుంది అనే విషయాలను గూర్చి డెరెక్ గారు లేఖనాలు దాచబడిన గొప్ప ధన నిధిని వెలికితీశారు.